
ఆర్మూర్ పట్టణంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కూలు కాలేజీ యాజమాన్యాల మరియు డ్రైవర్ల అవగాహన సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథులుగా జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి లు హాజరయ్యారు. డ్రైవర్లు విద్యార్థులను తమ కుటుంబ సభ్యులుగా భావించి సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. మైనర్లకు ఎవరు కూడా వాహనాలు ఇవ్వవద్దనిMVI వివేకానంద్ రెడ్డి అన్నారు. తనిఖీల్లో మైనర్లు పట్టుబడితే వాహనాల యజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లు పట్టుబడితే వాహనం ఆర్సి ఒక సంవత్సరం రద్దు చేస్తామని, జైలు శిక్ష, 25 వేల జరిమానాతో పాటు మైనర్ కు 25 సంవత్సరాలు వచ్చే వరకు లైసెన్స్ రాదని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మండల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లయ్య, సెక్రటరీ ప్రవీణ్ పవర్, కోశాధికారి తాళ్ల వేణు, రాష్ట్ర బాధ్యులు కాంతి గంగారెడ్డి, మానస గణేష్ తదితరులున్నారు.