
ఆలూరు మండల కేంద్రంలోని మల్లయ్య మందిరం పక్కన మండపంలో శనివారం రోజున ఉదయం 11 గంటలకి మాక్లూర్ మరియు ఆలూరు మండలాల సమావేశం నిర్వహించబడుతుందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మరియు జిల్లా నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. కావున బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.