
JAYNEWSTV వేల్పూర్, మే 23 ( జయ్ న్యూస్ ): వేల్పూర్ తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నూతన తహసీల్దార్ గా శ్రీనివాస్ పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల జిల్లా అధికారులు తహసిల్దార్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీల్లో భాగంగా నిర్మల్ నుండి వచ్చిన శ్రీనివాస్ వేల్పూర్ తహసిల్దార్ గా బాధ్యతలు తీసుకోగా ఇక్కడ పని చేసిన ఇన్చార్జి శ్రీకాంత్ కు బదిలీ అయిన రిలీవ్ అయ్యారు. తహసిల్దార్ కు సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.