
జయ్ న్యూస్, నిజామాబాద్: పహల్గాంలో పర్యాటకుల హత్యలు, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలపై సమగ్ర విచారణ జరిపి, భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో పహల్గామ్ హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయలని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో లో జిల్లా సదస్సు నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ లోయలో ఉగ్ర దాడి జరిగిందని, దాడి చేసిన వారిని ఇప్పటికి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని, ఆపరేషన్ సింధూర్ లో యుద్ధం అర్ధాంతరంగా ముగింపును అమెరికా అధ్యక్షుడు ట్రంపు ప్రకటించడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అమెరికా సామ్రాజ్యవాద అధినేతకు అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. ప్రపంచంలో అతి పెద్ద దేశమైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత పార్లమెంటులో కానీ, దేశములోని విపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి కానీ, చర్చించకుండా, నేరుగా యుద్ధ విరమణ ప్రకటన ట్రంపు చేయడం, నరేంద్ర మోడీ మౌనవ్రతం పాటించడం పరిశీలిస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగిపోయి మోకరిల్లినట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రజల దేశభక్తికి పరీక్ష పెట్టిన, నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాం యాత్రికులపై టెర్రరిస్టులు అతికిరాతంగా దాడి చేసి హత్య చేసి, మాయం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. పటిష్టమైన నిఘా విభాగం, సైన్యం కలిగి యున్న ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన అన్నారు. దేశంలో ప్రజలు శాంతిగా ఉండాలంటే ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించబడాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి, ప్రజల నిరసనను భరించలేకపోతుందని, వారి పక్షాన గొంతెత్తి వారిని రకరకాల ముద్ర వేసి హత్య చేస్తుందని ఆయన అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్ట వద్ద ఏకపక్ష దాడులు చేసి, ఆదివాసులను, మావోయిస్టులను చంపుతున్నారని ఆయన అన్నారు. అడవిలో ఉన్న ఖనిజ, ప్రకృతి సంపదను కార్పొరేట్ అధిపతులకు అప్పజెప్పె రహస్య ఒప్పందంలో భాగంగా, ఆదివాసులను భయభ్రాంతులకు మోడీ సర్కార్ గురి చేస్తుందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానాలు నల్ల డబ్బు వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జామా, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువులు, ఉపాధి భద్రత, రైతుల ఆదాయం రెట్టింపు, భేటీ పడావో బచావో , ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ,సుస్థిర పాలన లాంటి హామీలను అమలు చేయకుండా, ప్రజలు ప్రశ్నిస్తారని, ప్రజల ఆలోచనను వక్ర మార్గం పట్టించే కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. HRF జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమేష్ మత వైషామ్యాలు , ఉద్రిక్తలు తీవ్రం చేస్తూ, ప్రజా సంపదను పెట్టుబడిదారులకు అప్పజెప్తూ,హిందు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలు రాగానే ఏదో ఒక సమస్య సృష్టించి, సెంటిమెంటుతో రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా దేశంలో పేదరికం, నిరుద్యోగం, దరిద్రం నిర్మూలనకు, అసమానతలు, నిత్యవసర సరుకుల ధరల నియంత్రణ నిర్దిష్టంగా కృషి చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పరుచూరి శ్రీధర్, బి.భూమన్నా ,నీలం సాయిబాబా, సూర్య శివాజీ, గౌతం కుమార్, శివకుమార్,సత్యం,మార్క్స్, బాలయ్య,మల్లికార్జున్, సాయినాథ్,లక్ష్మి,సంజన, గోపాల్, సంజీవ్, ఏళ్ళన్న,మోహన్,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.