
బాల్కొండ మండల కేంద్రంలోని మహతి ఆశ్రమంలో నేడు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి MD ఇర్ఫాన్ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజలకు మంచి పాలన అందించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, నాయకులు సడక్ వినోద్, ఫయ్యుం, సన్నీ, సుమేర్, కలిగోట్ శ్రీనివాస్ చింటూ తదితరులున్నారు.