
జయ్ న్యూస్, ఆర్మూర్ : మాతో కలిసి చదువుకున్న ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లికి చెందిన మా మిత్రుని నరేష్ కు చికిత్స కోసం మా స్నేహితులందరం కలిసి జమ చేసిన రూపాయలు 1,01,500/- నగదును నరేష్ వాళ్ళ అమ్మగారికి నరేష్ SSC బ్యాచ్ మిత్రులు అందజేశారు. మేము అడగగానే వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్న సరే మా మిత్రుని ఆరోగ్యం బాగుపడాలని ఆర్థిక సాయం చేసిన నరేష్ మిత్రులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మల్యాల నర్సారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.