
జయ్ న్యూస్, ఆర్మూర్: పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ చేసి కోర్టు ఎదుట హాజరు పరచడం జరిగిందని పట్టణా సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం పదిమందికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విధించారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని వాహనదారులను ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు.