
జయ్ న్యూస్, ఆర్మూర్: మున్సిపల్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో, అలాగే అశోక్ నగర్ కాలనీలో మంగళవారం రోజు మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సేవలు అనిర్వచనియమన్నారు. వారు చేసిన సేవలు దేశంలోని ప్రతి పౌరుడు, ప్రజలు గుర్తించుకోవాలన్నారు. వ్యవసారంగాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఆయన చేసిన సేవలు మరువలేనిమన్నారు. ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. యువత చెడు మార్గంలో పయనించకుండా విద్యారంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించి యూనివర్సిటీలను నిలబెట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ విట్టం జీవన్, నాయకులు పూల నర్సయ్య, మట్టేల శ్రావణ్, నటరాజ్, శాల ప్రసాద్, రింగుల భూషణ్, ఆజ్జు భాయ్, ఫాయుమ్, బబ్లూ, అబ్దుల్ మోసిన్, అడ్వకేట్ నదీమ్, షట్పెల్లి నారాయణ, భగత్, తదితరులు పాల్గొన్నారు.