
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి ఐదవ వార్డులో మైస భారతి, మైస కవిత లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగిందని, ఈ ఇందిరమ్మ ఇళ్లకు AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గు పోవడం జరిగిందని తాజా మాజీ కౌన్సిలర్ బండారి శాల ప్రసాద్ తెలిపారు. AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతుందని అన్నారు. ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాక విడతలవారీగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భూపేందర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.