
జయ్ న్యూస్, సిరికొండ ప్రతినిధి ఆర్ సి రెడ్డి: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభ పాఠశాలలో గురువారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ధర్పల్లి-సిరికొండ-ఇందల్వాయి ఖండానికి చెందిన ప్రసాద్ గౌడ్, చాట్ల ప్రణీత్, మహేష్ కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సమాజ శ్రేయస్సు, దేశ రక్షణ, సద్భావనకే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యంగా పని చేస్తోంది. దేశ యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించే దిశగా శిక్షణా శిబిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించబడుతున్నాయి” అని వారు అన్నారు.విద్యార్థులు దేశ భవిష్యత్తు కావడంతో, వారిలో మంచి పౌరునిగా మారే గుణాలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.