
మే 31న వరంగల్‌లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం
ప్రతి మండలం నుండి వాహనాలతో తరలిరావాలి
సిరికొండ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మొట్టల దీపక్ పిలుపు
జై న్యూస్ ఆర్ సి రెడ్డి , మే 29:
సిరికొండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సిరికొండ మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “మన జాతి నాయకుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డును స్వీకరించిన తర్వాత, తన జన్మభూమి వరంగల్ గడ్డపై మే 31, 2025 శనివారం సాయంత్రం 4:00 గంటలకు అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద జాతీయ స్థాయిలో అతిశయంగా స్వాగతం పలకాలి,” అని పిలుపునిచ్చారు.
అనంతరం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రం వరకు వేలాది వాహనాలు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ ముగిసిన తర్వాత సాయంత్రం 5:00 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుందని, అందులో మందకృష్ణ మాదిగ జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారని దీపక్ తెలిపారు.ఈ మహా సభను విజయవంతం చేయడానికి సిరికొండ మండలంలోని అన్ని గ్రామాల మాదిగ, మాదిగ ఉపకుల సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.