
జయ్ న్యూస్, సిరికొండ: సిరికొండ మండలం చిన్న వాల్గోట్ గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముట్టడి రెడ్డి సంఘ సభ్యులు పోచమ్మ బోనాలను ఎత్తుకొని అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్న వాల్గోట్ ముట్టడి రెడ్డి సంఘ సభ్యులు మోహన్ రెడ్డి, గంగారెడ్డి, దేవేందర్ రెడ్డి, తెలుగు దాస్, తెలుగు శ్రీనివాస్, వినాయక రెడ్డి, సాయి తేజ రెడ్డి, పండు రెడ్డి, భూమారెడ్డి, రోండ్ల భూమారెడ్డి, అశోక్ రెడ్డి, అరవింద్ రెడ్డి, ముఖేష్, సాయి రెడ్డి, నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు