
*లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*
జయ్ న్యూస్, భీమ్ గల్: మండలం పురాణీపేట్ గ్రామానికి చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సీరం అను సాగర్, దైడి.సురేష్, తోట శివ క్రాంతి, తోట.గణేష్, మల్లెల గంగయ్య, పత్రి అక్షయ్, తోట రమేష్, సుదర్శన్, తోట చిన్న రాజన్న కాంగ్రెస్ నాయకుల చేతుల మీదగా లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్” కి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.