
జయ్ న్యూస్, ఆర్మూర్: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈరోజు సుమారు 5 లక్షలకు పైగా విలువగల CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాన్ శీను, నర్సారెడ్డి, ఖాందేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.