
జయ్ న్యూస్, ఆర్మూర్: మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో గల గిరిజన సంక్షేమ పాఠశాల, మామిడిపల్లిలోని తపస్వి స్వచ్ఛంద సేవ పాఠశాల, ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్లో శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణ పిచికారి మందును స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ సబ్ యూనిట్ అధికారి సాయి మాట్లాడుతూ.. పాఠశాలలు త్వరలో ప్రారంభం కాబోతున్న సందర్భంగా వసతి గృహాల్లో, స్కూళ్లకు విద్యార్థులు వస్తారు, కాబట్టి ముందస్తుగా దోమల నివారణ కోసం ఏసీఎం అనే మందును పిచికారి చేయించామని, దీనివల్ల దోమలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కుల మోహన్, గణేష్, సాగర్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.