
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హయ్యర్ సెకండరీ స్కూల్ (HSS 1966-1967) S.S.C. బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. సుమారు 57 ఏళ్ల తర్వాత తమ తోటి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరి కష్ట సుఖాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు స్థానం గొప్పదని కొనియాడారు.