
జయ్ న్యూస్, ఆర్మూర్: జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఆర్మూర్ మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాకే పెద్దదిక్కు అయిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి మంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడని వారు కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న గొప్ప రాజకీయవేత్త సుదర్శన్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీకి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని మంత్రి పదవి ఇవ్వాలని అయ్యప్ప శ్రీనివాస్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.