
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎన్.ఆర్. భవన్ కార్యాలయంలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ కర్క గణేష్ అధ్యక్షతన జీవ పరిణామం అనే అంశంపై క్లాసును జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు బోధించారు. నర్ర రామారావు మాట్లాడుతూ, రాజకీయ అంశాలతో పాటు చరిత్ర, సైన్సు విషయాలను కూడా నేర్చుకోనే దృక్పథాన్ని కలిగిన వాళ్లు ప్రగతిశీల విద్యార్థులని అన్నారు. మనువాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని మతం పేరుతో విడదీస్తూ, పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రగతిశీల శక్తులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. అందుకోసం తరగతులు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. సైన్సు పట్ల, చరిత్ర పట్ల సమకాలీన రాజకీయాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సి.ఎల్.సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ జిల్లా నాయకులు మురళి, మాస్ లైన్ డివిజన్ నాయకులు నారాయణ,మోహన్ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, పి.డి.ఎస్.యు. నాయకులు నసిర్,నాగేష్, సృజన్, సంతోష్,సునీల్, సాయి,కార్తీక్,అరవింద్, వైష్ణవి,లిఖిత, అక్షయ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.