
జయ్ న్యూస్, ఆర్మూర్: పాఠశాలలు పున: ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ప్రైవేట్ స్కూల్ ల బస్సులకు తనిఖీలు నిర్వహిస్తున్నామని MVI వివేకానంద రెడ్డి తెలిపారు. ఆర్మూర్ రవాణా శాఖ కార్యాలయం వద్ద ఆయన ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ను పరీక్షించారు. బ్రేక్ కండిషన్, స్టీరింగ్ కండిషన్, అన్ని కూడా పర్ఫెక్ట్ గా పని చేసే విధంగా ఉండాలన్నారు. డ్రైవర్ వయస్సు 60 సంవత్సరాలు మించకుండా ఉండాలన్నారు. ప్రతి స్కూల్ బస్సు కు ఒక అటెండెంట్ ఉండాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.