
జయ్ న్యూస్, డొంకేశ్వర్: డొంకేశ్వర్ మండలం గాదేపల్లి గ్రామానికి చెందిన మల్కన ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 75 వేల రూపాయల ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్ఓసి కాపీ ఇప్పించిన వినయ్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.