
జయ్ న్యూస్, బాల్కొండ: బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో “అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం” చేపట్టారు. DWO రసూల్ బి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రీస్కూల్ ప్రాముఖ్యతను పిల్లల తల్లులకు వివరించారు. పిల్లల సర్వాంగ వికాసం కోసం అంగన్వాడీలో నేర్పించే ప్రీస్కూల్ కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కావాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరును పెంచాలన్నారు. సూపర్వైజర్ రమాదేవి, ఎంపీడీవో, ఎంఈఓ, ఏపీఓ తదితరులు పాల్గొన్నారు.