
జయ్ న్యూస్, మోర్తాడ్: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. గురువారం మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, పాలెం, గాండ్లపెట్ గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.