
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం పిప్రి, చేపూర్ గ్రామాలలో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. పిప్రిలో జరిగినా రెవెన్యూ సదస్సుకు ఎమ్మార్వో సత్యనారాయణ, చేపూర్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు డిప్యూటీ తాసిల్దార్ సుజాత హాజరయ్యారు. భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. సమస్యలు ఉంటే దరఖాస్తులు సమర్పించాలన్నారు. పిప్రి 97, చేపూర్ 179 దరఖాస్తులు వచ్చాయన్నారు.