
జయ్ న్యూస్, ఆర్మూర్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని 10 మరియు 31వార్డులలో పారిశుద్ధ్యం కార్యక్రమం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ మలేరియా, డెంగ్యూ నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. హౌసింగ్ బోర్డ్ పార్కులో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్లు నీలిమ, సానిటరీ జవాన్ రవి తదితరులు పాల్గొన్నారు.