జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలో గాని, జిల్లాలో కానీ ప్రైవేట్ జూనియర్ కళాశాలకు అఫ్లీయేశన్ గుర్తింపు ఉందా లేదా అని స్పష్టంగా తెలుసుకొని మాత్రమే విద్యార్థిని విద్యార్థులను చేర్పించాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ స్పష్టం చేశారు. కావున విద్యార్థిని,
విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోకుండా కళాశాల గుర్తింపు ఉందా లేదా అని తెలుసుకొని మాత్రమే అడ్మిషన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆఫ్లీయేషన్ లేని జూనియర్ కళాశాలలో చేరిన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.