
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి చెందిన పవార్ కృపా నక్షత్రకి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు దేశ వ్యాప్తంగా ఉన్న MBBS కాలేజీలలో ప్రవేషాల కోసం నిర్వహించిన నీట్ 2025 పరీక్షలో ఆల్ ఇండియా 3050 ర్యాంక్ సాధించడం జరిగింది. విద్యార్థిని తల్లిదండ్రులు అంబిక, ప్రవీణ్ పవార్ లు మాట్లాడుతూ తమ కూతురు పాఠశాల విద్యాభ్యాసం పట్టణంలోని విద్య హై స్కూల్ లో మరియు ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కళాశాల, హైదరాబాద్ లో తన పూర్తి చేయడం జరిగిందని వారు తెలియచేశారు. ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్స్ సాధించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినికి పలువురు అభినందనలు తెలిపారు.