
జయ్ న్యూస్, నందిపేట్: నందిపేట్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల వివాహ ఖర్చులకు 50 వేల నుండి 1లక్ష రూపాయలకు పెంచినందుకు ఉమ్మడి మండలంలోని దివ్యాంగులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో మాకు ప్రత్యేక వికలాంగుల కోట ద్వారా రాజీవ్ యువ వికాస్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, దమ్మాయి శ్రీను, మన్పూర్ భూమేష్, నిఖిల్, దివ్యంగుల మండల అధ్యక్షులు లక్ష్మి, కలీం, సాగర్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.