
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్ నందు డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎస్. చంద్రిక తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాస్ అయిన విద్యార్థినులు అర్హులు… గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో BSC( MPC,Mpcs,Mscs,BZC,MBZC), BCOM (CA,BA)BA( HEP) కోర్సులలో సీట్లు కలవని…. ఆసక్తి కలిగిన విద్యార్థినులు టెన్త్, ఇంటర్ మెమో, మరియు బోనఫైడ్, కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ తో పాటు మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఆర్మూర్ లోని గురుకుల డిగ్రీ కళాశాలలో ఇవ్వాలని ప్రిన్సిపల్ డా.ఎస్. చంద్రిక సూచించారు. దరఖాస్తులకు గడువు జూన్ 23 వరకు కలదు… ఆసక్తి కలిగిన విద్యార్థినులు తమ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాలని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు…