
జయ్ న్యూస్, ఆర్మూర్: TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి పలు విషయాలపై TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, శ్రీను తదితరులున్నారు.