
జయ్ న్యూస్, ఆర్మూర్: నలందలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు…. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలోని నలంద హైస్కూల్లో ఉపాధ్యాయులకు మాతృశ్రీ పబ్లిషర్స్ వారి ఆధ్వర్యంలో బోధనా మెలుకువలలో శిక్షణ తరగతులు నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులలో విద్యార్థులకు టీచింగ్ మెథడాలజీ, యాక్టివిటీస్, ప్రాజెక్టు వర్క్, స్పీకింగ్, రీడింగ్ అనే అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. మాతృశ్రీ పబ్లిషర్స్ AM శంకర్, ట్రైనర్ శామ్యూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మాతృశ్రీ ట్రైనర్లని నలంద యాజమాన్యం ప్రసాద్, సాగర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒలంపియాడ్ స్కూల్ ఉపాధ్యాయులు, అకాడమిక్ ఇంచార్జ్ అతోఫా నౌషిన్, తదితరులు పాల్గొన్నారు.