
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ లో ఇస్కాన్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్రలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని పూజలు చేసి జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇస్కాన్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఇస్కాన్ పెద్దలు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర పెర్కిట్ నుండి మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండు, పాత బస్టాండు, బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని, బాలాజీ ఫంక్షన్ హాల్ లో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కేంద్రం పెద్దలు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, నివేదన్ గుజరాతి mjf, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.