
జయ్ న్యూస్, నిజామాబాద్: అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం నిజామాబాద్ నగరంలో వివేకానంద పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు ఈ సందర్భంగా మాదకద్రవ్యాలు మానేద్దాం… మత్తుపదార్థాలు వదిలేద్దాం…. అనే నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లతా నారా గౌడ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం ఈ మధ్యకాలంలో పెరిగిపోతుందని, దీనికి ఎవరు కూడా వ్యసనం కావద్దని తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు డ్రగ్స్ వాడటం వలన కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు.