
జయ్ న్యూస్, ఆర్మూర్: నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లను జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వినయ్ రెడ్డి వారితో నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.