
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండల కేంద్రంలోబీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట్ గంగాధర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తరపున, మా ప్రాంత రైతుల తరపున భారత ప్రధాని నరేంద్ర మోడీజీ, కేంద్ర మంత్రులు అమితాషా, కిషన్ రెడ్డి లకు మరియు ఇందూరు లోక సభ సభ్యులు అరవింద్ కు మా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఎన్నో సంవత్సరాల చిరకాల వాంఛ, పసుపు రైతుల కళ నెరవేర్చిన వేళ, మన రాష్ట్రముతో పాటు మధ్య ప్రదేశ్, మహా రాష్ట్ర లో కూడా పసుపు పంటను అధికంగా పండిస్తూ ఉంటారు… కానీ ఈ ప్రాంత రైతుల పట్ల, అరవింద్ పై ఉన్నా ప్రేమతో ఇందూరు నడిబొడ్డున పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, మన ప్రాంత రైతు బిడ్డను పల్లె గంగారెడ్డిని మొట్ట మొదటి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ చేయడం పట్ల మేము గర్వాంగా, కృతజ్ఞతగా భవిస్తూ ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు. నరేంద్ర మోడీజీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వం. గత కాంగ్రెస్, యూపిఏ పాలనలో రైతులకు ఎరువుల కొరతలు బాగా ఉండేవి, ఎరువుల దుకాణం వద్ద రైతులు చెప్పులను క్యూలో పెట్టి ఎదురు చూసేవారు. ప్రస్తుతం మోడీజీ నాయకత్వంలో ఆ పరిస్థితి రైతులకు లేదు… అంతే కాకుండా ప్రతి రైతుకు ఎరువులపై సబ్సిడీ ఇస్తూ, ప్రతి రైతుకు ఒక్క ఎకరానికి అరువేల చొప్పున ఇస్తూ మోడీజీ నాయకత్వంలో భారత ప్రభుత్వం రైతులకు వెన్నుముకగా నిలుస్తూ ఉన్నారు. నిన్న ఇందూరులో పసుపు బోర్డు ప్రారంభం, రైతు సమ్మేళనం విజయవంతం చేసిన రైతులకు, రైతు అభిమానులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికి బీజేపీ పార్టీ తరపున ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు తోట నారాయణ, బ్రాహ్మణపల్లి గంగాధర్ పాల్గొన్నారు.