
జయ్ న్యూస్, ఆర్మూర్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలకు 2(f) గుర్తింపును ప్రకటించింది. సాధారణంగా నాక్ నుండి ‘A’ గ్రేడ్ పొందిన కళాశాలలు అటానమస్ హోదాకు అర్హత కలిగి ఉంటాయి. ఈ ప్రక్రియలో మొదటగా 2(f) గుర్తింపు, అనంతరం అటానమస్ హోదా మరియు 12(B) గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఈ గుర్తింపు వల్ల కళాశాల నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అందిస్తున్న కోర్సులకు యూనివర్సిటీ హోదా కలిగి ఉందని అర్థం. త్వరలోనే క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు UGC నుండి 12(B) గుర్తింపు మరియు అటానమస్ హోదా లభించే విధంగా కృషి చేస్తున్నామని కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మరియు సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ తెలియజేశారు. UGC 2(f) గుర్తింపు లభించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, విభాగాలాధిపతులు, బోధనా మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు ద్వారా ఆర్మూర్ పట్టణానికి, అలాగే నిజామాబాద్ జిల్లా ఇంజినీరింగ్ విద్యా రంగానికి విశిష్ట గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు మరియు ఉత్తర తెలంగాణ ప్రాంత యువతకు మెరుగైన విద్యా సేవలు అందించే అవకాశం ఏర్పడనుందని అన్నారు.