
జయ్ న్యూస్, ఆర్మూర్: నందిపేట్ మండలం వెల్మల్ గ్రామ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి గారిని ని కలిసి అభివృద్ధికి దేవాదాయ శాఖ నుండి నిధులు కేటాయించాలని కోరడంతో సానుకూలంగా స్పందించి సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖని కోరడంతో వారు వెల్మల్ గ్రామ పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ నుండి 30,00,000/- లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకన్నందుకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెల్మల్ గోపి,గంగాధర్ రాజేందర్, శ్రీధర్, మల్లేష్, కిషన్, రమేష్,ముత్యం,సంతోష్,మహిపాల్, మండల ప్రెసిడెంట్,అనంత్, ముదిరాజ్ సంఘ డబ్బులు భూమేష్,అశోక్ ,సుబ్బన్న ,సురేష్ నరేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.