
జయ్ న్యూస్, ఆర్మూర్: రాబోయే రోజుల్లో BJP పార్టీ రాష్ట్రంలో మరింత బలోపేతం అవుతుందని ఆర్మూర్ MLA రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో తెలంగాణ BJP పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. నూతన BJP రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను BJP పార్టీ విజయం సాధిస్తుందని MLA రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.