
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ డిఈఓ కార్యాలయంలో BRSV ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. BRSV విభాగం నాయకులు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో అత్యధిక ఫీజులు, పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. నర్సరీ నుంచి లక్షల్లో ఫీజులు రాబడుతున్న విద్యాశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుమన్, బన్నీ, రాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు.