
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా దేవాంగ విద్య కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ అమర్, డాక్టర్ స్నేహ, డాక్టర్ శ్రావణిలను సన్మానించినట్లు రఘు, రాములు తెలిపారు. ప్రజలకు తమ వంతు వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామని డాక్టర్లు చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తూ ఉండడం అభినందనీయమని జిల్లా దేవంగ విద్యా కమిటీ సభ్యులు పేర్కొన్నారు.