
జయ్ న్యూస్, ఆర్మూర్: మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని జిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్ డే దినోత్సవాలను పురస్కరించుకొని ఆర్మూర్ లోని ప్రముఖ వైద్యులు, CA లను ఘనంగా సన్మానించారు. అందులో భాగంగా CA మారుతి పవన్, CA మౌనిక రెడ్డి, Dr హరి నారాయణ, సీనియర్ సర్జన్ Dr వెంకటి, జనరల్ పీజీషియన్ Dr లింగారెడ్డి, DGO గైనకాలజిస్ట్, Dr శిరీష దంపతులకు, రేడియాలజిస్ట్ Dr శ్రావణ్ రెడ్డి, కార్డియాలజిస్ట్, Dr కొట్టురూ వంశీకృష్ణ, Dr గోవింద్, Dr పవన్ గౌడ్ లకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలియచేసి ఘనంగా సన్మానించి, మెమంటోలను ప్రధానం చేయడం జరిగిందని, సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో గొప్పదని వైద్యో నారాయణో హరి శాస్త్రాలలో చెప్పడం జరిగిందని, దేవుడికన్న కనిపించే దేవుడు మిన్న అని డాక్టర్లను ప్రజలు కొలుస్థారని జిజి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి Mjf లు పేర్కొన్నారు. అనంతరం నివేదన్ మాట్లాడుతూ 1991 సంవత్సరం నుండి యావత్తు భారతదేశ వ్యాప్తంగా డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని, స్వాతంత్ర్య సమరయోధుడు ,రాజకీయవేత్త, ప్రముఖ వైద్యులు భారత రత్న పురస్కార గ్రహీత Dr బిధాన్ చంద్రా రాయ్ స్మరాకార్తం ఇట్టి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు బెల్దారీ శ్రీనివాస్,డీజే దయానంద్,డి జె సునీల్,దొండి నారాయణ్ వర్మ, డీజే కాశీనాథ్, బోబిడే కరణ్, దుర్గా ప్రసాద్, కోలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.