
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారంకు USFI జిల్లా అధ్యక్షులు సిద్ధాల నాగరాజు వినతిపత్రం అందజేశారు. USFI జిల్లా అధ్యక్షులు సిద్ధాల నాగరాజ్ మాట్లాడుతూ ఆర్మూర్ మండలంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ సంవత్సరం స్కూల్స్ పున:ప్రారంభం అయిన తర్వాత విద్యార్థులకు బాత్రూం పరిస్థితిలు ఇబ్బంది మారిందని, కొన్ని స్కూళ్లలో బాత్రూంలలో వాటర్ సౌకర్యం కూడా లేదని అన్నారు. ప్రతి ప్రభుత్వ హైస్కూల్లో & ప్రైమరీ స్కూళ్లలో స్కావెంజర్స్ ని ఏర్పాటు చేసి రెగ్యులర్ గా బాత్రూంలు శుభ్రంగా ఉంచాలని ఆయన కోరారు. నేటికీ స్కూల్స్ ప్రారంభమై 20 రోజులు గడుస్తా ఉన్న కొంతమంది విద్యార్థులకు ఇప్పటివరకు డ్రెస్సులు బుక్స్ అందని పరిస్థితి కూడా ఉందన్నారు. ఇలా ఉండడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం సమయంలో ఆర్మూర్ మండలంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలు వర్షానికి కురుస్తా ఉన్నాయి. అట్లాంటి బిల్డింగ్స్ ను విద్యాశాఖ అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారులు ప్రతి ప్రభుత్వ స్కూల్స్ ని వారానికి ఒకసారి సందర్శించాలని, విద్యార్థులతో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో USFI ఆర్మూర్ నాయకులు అభిషేక్, హర్ష సాయి, సిద్దు తదితరులు పాల్గొన్నారు.