
జయ్ న్యూస్, ఆలూర్: *రైతుల కోసం యూరియా సిద్ధం…
*కల్లెడలో ఎరువుల పంపిణీ పై పరిశీలన…
*అవసరానికి తగినంత తీసుకోండి….
*ఏడిఏ విజయలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి రాంబాబు…
ఆలూర్ మండలానికి 100 మెట్రిక్ టన్నుల యూరియా అందినట్లు ఏడిఏ విజయలక్ష్మి, మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు తెలిపారు. ఒక్కరోజే 2000 బస్తాలు వచ్చాయని, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు అవసరానికి తగినంత మాత్రమే తీసుకోవాలని వారు సూచించారు. పంటకాలం మొత్తానికి ఒకేసారి తీసుకుని కొరత సృష్టించవద్దని, వదంతులను నమ్మకుండా ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతోందని స్పష్టం చేశారు. అదేవిధంగా రైతులు యూరియా అవసరం వరకే కొనుగోలు చేయాలి, అయితే ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని వారు స్పష్టం చేశారు.