
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డిని జాతీయ అవార్డు గ్రహీత, ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు పట్వారితులసి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం తాను రూపొందించిన ఆజాద్ అమృత మహోత్సవ పుస్తకాన్ని కలెక్టర్ కు బహుకరించారు. స్వచ్ఛందంగా తమ వంతు సమాజానికి సేవలు అందించడం అభినందనీయమని, పట్వారి తులసి కుమార్ చేస్తున్న సేవలను కలెక్టర్ ప్రశంసించారు. భవిష్యత్తులో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి పేర్కొన్నారు.