
జయ్ న్యూస్, భీమ్గల్: డ్రగ్ ఫ్రీ తెలంగాణ మహోద్యమ అవగాహన ర్యాలీ_విద్యార్థి సేన విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ 100 రోజుల మహోద్యమం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు భీంగల్ మండలంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ మరియు చెడు వ్యసనాలకి అలవాటు పడరాదని మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఈ గంజాయి డ్రగ్స్ లాంటి వాటిని క్షేత్రస్థాయి నుంచి నిర్మూలించాలని తెలంగాణ రాష్ట్రం అంతట 100 రోజులు కార్యక్రమాలు చేపట్టామని విద్యార్థి సేన జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ తెలిపారు. విద్యార్థుల్లో మానసిక శారీరక ఒత్తిడికి లోనవకుండా ఉండాలంటే విద్యతోపాటు ఆటలు ఎంతగానో అవసరమని అన్నారు. ఇలాంటి డ్రగ్స్ మరియు గంజాయి లాంటి వాటి మీద పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ వారు ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయిని నిర్మూలించాలని కోరారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖ వారు మరియు విద్యార్థి సేన నాయకులు ప్రణయ్, వికాస్, సిద్దు, అజయ్, అంజి, అరవింద్ నాయకులు పాల్గొన్నారు.