
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండలంలో ఎంపీడీవో గంగాధర్ ఆధ్వర్యంలో సీసీలు, ఏపిఎం మరియు పంచాయతీ కార్యదర్శిలతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు, మహిళా సంఘాల ద్వారా లోన్లు మంజూరి విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో గల మహిళా సంఘంలో ఉన్న సభ్యులు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి అందరికీ కూడా తీసుకునే వారికి లోన్లు మంజూరు చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సహకారం అందించాలని వారికి తెలియజేశారు. అదేవిధంగా మన మహోత్సవము చేపట్టే కార్యక్రమంలో విఏవోలు మహిళా సంఘ సభ్యులు మరియు గ్రామ సంఘాలు అన్నీ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
సూచించారు. సీజనల్ వ్యాధుల గురించి వివరించడం జరిగింది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలను వారికి తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, ఏపిఎం ఆర్మూర్ ఏపీఎం, సీసీలు, వివోఏలు, పంచాయతీ కార్యదర్శిలందరూ పాల్గొన్నారు.