
జయ్ న్యూస్, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం రోజు విశ్వబ్రాహ్మణుల రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం ఆదేశాల మేరకు అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాంతియుతంగా ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
వారు మాట్లాడుతూ చేతివృత్తికి దూరమైన విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ పథకాలలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షుడు నూనె గంగాధర్, ఆర్మూర్ జనరల్ సెక్రెటరీ శ్రీరామ్ నరసయ్య, విశ్వకర్మ యోజన అధ్యక్షుడు రాగి నరేష్, కళ్యాణ్, శ్రీకాంత్, నూనె మునాల్, తాడూరి నరేష్, సంతోష్, రవి, ప్రదీప్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.