
జయ్ న్యూస్, నందిపేట్: శుక్రవారం నందిపేట్ మండల కేంద్రంలో బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో వివేకానంద 123వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేవైఎం మండల అధ్యక్షుడు మంగ్లరపు నవీన్ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నాగ సురేష్ మాట్లాడుతూ నిద్ర అవస్థలు ఉన్నటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని వెన్ను తట్టి మేలుకొల్పి ప్రపంచ దేశాలకు భారతీయ సాంస్కృతి సాంప్రదాయ గొప్పతనాన్ని తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. మండల అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో భారతీయతత్వాన్ని బోధించి నీరాజనాలందుకున్న మహోన్నత అధ్యాత్మికవేత్త, తన ఉపన్యాసాలతో జగతిని జాగృతం చేసి , తన ఉపన్యాసాలతో నిరుత్సాహంగా ఉన్నటువంటి యువతను ఉత్తేజపరచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుకు రవి , సల్మాన్, సాయి,నిఖిల్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.