
జయ్ న్యూస్, సిరికొండ: నిజామాబాద్ జిల్లా రూరల్ ప్రాంతంలోని సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన చోరీలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. రాత్రి సుమారు 1:30 ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి గుట్కా, కిరాణా సామాగ్రి దుకాణాల టార్గెట్ చేసి, తాళాలు పగలగొట్టి రూ.40,000 పైగా నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.చోరీ విషయం తెలిశాక ఉదయం స్థానికులు గుమిగూడగా, దుకాణదారులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిరికొండ ఎస్సై ఎల్. రామ్ ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ, స్థానికుల వాంగ్మూలాలు సేకరించి, మౌలిక ఆధారాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.బాధితులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో రాత్రివేళ గస్తీ పెంచాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ చోరీల వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా? ముందుగానే ప్లాన్ చేసిన దాడా? అన్నదానిపై పోలీసులు అనుమానంతో విచారణ జరుపుతున్నారు.