
జయ్ న్యూస్, ఆర్మూర్: జూలై 6: ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఆదర్శవంతమైనదని మిత్రమండలి సభ్యులు ఖాందేష్ శ్రీనివాస్, గుజరాతి లయన్ నివేదన్ mjf, ప్రవీణ్ పవార్, డీజే దయానంద్ అన్నారు. ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలోని ఖాందేశ్ కాంప్లెక్స్ లో ఆదివారం ఇటీవల నియామకమైన క్షత్రియ సమాజ్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు సహస్రార్జున ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. వారు మాట్లాడుతూ క్షత్రియ కులస్తులైన యువతీ యువకులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమింపబడడం అభినందనీయమన్నారు. క్షత్రియ విద్యార్థులు, యువకులు వీరిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ర్యాంకులు సాధించి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమించబడడం క్షత్రియ సమాజంలోని వారందరికీ గర్వకారణం అన్నారు. అనంతరం నీట్ లో జాతీయస్థాయి ర్యాంకు సాధించిన పవార్ కృపా నక్షత్రతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకమైన విశ్వనాథ్ రాజరాజేశ్వరి, కర్తన్ అఖిల, బోబిడే నాగశ్రీ, ఘటడి గీత, చౌల్ శ్రీనివాస్ (చంటి), వాగ్లే దినేష్, ఖోడె శ్రీనివాస్, గటడి రామకృష్ణ, హజారి జగన్నాథ్ లను పూలమాలలు, శాలువా, మెమొంటో లతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ సంగీత ఖాందేశ్, లోటస్ పాఠశాల కరస్పాండెంట్ పవార్ అంబిక, మిత్రమండలి సభ్యులు జెస్సు ఆనంద్, సాత్ పుతే శ్రీనివాస్, బొబిడే గంగా కిషన్, షికారి రాజు, బొచ్కర్ వేణు, బారడ్ ప్రవీణ్, సంతని విజయ్, గట్టడి రాజేష్, అల్జాపూర్ రాజేష్, హజారి ఆనంద్, పాల్గొన్నారు.