
జయ్ న్యూస్, ఇందల్వాయి: ఈరోజు ఇందల్వాయి, డిచ్ పల్లి, జక్రాన్ పల్లి మండలాలపై నుంచి వెళ్తున్న జాతీయ రహదారి 44 పై ఉన్న ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు గల బ్లాక్ స్పోర్ట్స్ ను నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న ప్రదేశాలను సందర్శించి రోడ్డు ప్రమాదాలకు గల కారకాలు తెలుసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు అనేదాని పై నేషనల్ హైవే సిబ్బందికి మరియు వాటి సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్, ఎస్సై ఇందల్వాయి, డిచ్పల్లి సిబ్బంది మరియు నేషనల్ హైవే సిబ్బంది పాల్గొన్నారు.